లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మృతి పట్ట హాలీవుడ్ నటీ ఏంజెలీనా జోలీ సంతాపం తెలిపారు. వీరిద్దరూ గతంలో కలిసి నటించారు. 2007లో రిలీజ్ అయిన ఎ మైటీ హార్ట్ మూవీలో ఏంజెలీనా జోలీతో కలిసి ఇర్ఫాన్ నటించారు. మైటీ హార్ట్ సెట్‌లో ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించిందన్న ఆమె... కళాకారుడిగా ఇర్ఫాన్ ప్రత్యేకతను చాటుకున్నారని కొనియాడారు. గొప్ప ఆర్టిస్ట్ తో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన మంచితనం, చిరునవ్వు ఇంకా గుర్తున్నాయని ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు. ఇర్ఫాన్‌ను ఆరాధించే కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని జోలీ ట్వీట్లో పేర్నొన్నారు.
ఇర్ఫాన్ మృతికి ఏంజెలీనా జోలీ సంతాపం